Legal Right | మీరు కొన్న వస్తువు డిఫెక్టివ్‌గా ఉందా.. వినియోగదారుల చట్టం కల్పిస్తున్న అధికారాలు ఇవీ..

ఏదైనా వస్తువు కొంటే పలిగిపోయి ఉండడమో, పాడైపోవడమో లేక ఇతర సమస్యలతో ఉంటే కొందరు అమ్మకందారులు దాన్ని రీప్లేస్ చేయడానికి సవాలక్ష ఇబ్బందులు పెడతారు. మీదే తప్పు.. కొన్న తర్వాత మాకు సంబంధం లేదు.. అంటూ బుకాయిస్తుంటారు.

defective products

ప్రతీకాత్మక చిత్రం

ఏదైనా వస్తువు కొంటే పలిగిపోయి ఉండడమో, పాడైపోవడమో లేక ఇతర సమస్యలతో ఉంటే కొందరు అమ్మకందారులు దాన్ని రీప్లేస్ చేయడానికి సవాలక్ష ఇబ్బందులు పెడతారు. మీదే తప్పు.. కొన్న తర్వాత మాకు సంబంధం లేదు.. అంటూ బుకాయిస్తుంటారు. అయితే, ఇలాంటి సమస్యల పరిష్కారానికి వినియోగదారుల చట్టం వినియోగదారులకు పలు అధికారాలు కల్పిస్తోంది. ఈ చట్టం ద్వారా కొత్త వస్తువును తెప్పించుకోవచ్చు లేదా రీఫండ్ పొందవచ్చు. ఆ వస్తువే అవసరం లేదనుకుంటే రిటర్న్ చేయవచ్చు. వినియోగదారుల చట్టం ఫ్రాడ్, డిఫెక్ట్స్, మిస్‌లీడింగ్ యాడ్స్ నుంచి వినియోగదారులకు రక్షణ కల్పిస్తుంది. ఈ చట్టం ద్వారా చట్టబద్ధంగా సదరు కంపెనీలపై చర్యలు తీసుకోవచ్చు.

రీఫండ్ లేదా రీప్లేస్‌మెంట్ ఎప్పుడు పొందవచ్చంటే..

- మీరు కొన్న వస్తువు డిఫెక్టివ్‌గా ఉన్నా, డ్యామేజీ అయినా, అది భద్రతా ప్రమాణాలు పాటించకపోయినా

- మీరు కొన్న వస్తువు కాకుండా, వేరే వస్తువు మీకు డెలివరీ చేసినప్పుడు లేదా యాడ్‌లో చూపించినట్లు లేకపోయినా

- అదనపు చార్జీలు వసూలు చేసినా, తప్పుడు ధరలు నమోదు చేసినా

- వారంటీ ఉన్న సమయంలో సర్వీస్ అందించకపోయినా, సపోర్ట్ ఇవ్వకపోయినా

రీఫండ్ పొందేందుకు ముందుగా..

- బిల్లులు, స్క్రీన్ షాట్స్‌తో అమ్మకందారుడికి ఫిర్యాదు చేయాలి.

- కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి సమస్య గురించి వివరించాలి.

- సమస్య అలాగే ఉంటే లీగల్ నోటీస్ పంపవచ్చు.

ఈ కామర్స్, రిటర్న్ పాలసీలు: 

అమెజాన్, ఫ్లిప్ కార్ట్, ఇతర ఈ కామర్స్ వెబ్‌సైట్స్ రీఫండ్ అంశంలో కచ్చితమైన సమయాన్ని కలిగి ఉంటాయి. ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో ఏదైనా వస్తువు కొనేటప్పుడు రిటర్న్ పాలసీ కచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఎలక్ట్రానిక్ లాంటి వస్తువులకు కేవలం రీప్లేస్‌మెంట్ మాత్రమే ఉంటుంది. రీఫండ్ వర్తించదు.

ఫిర్యాదు స్వీకరించేందుకు సమ్మతించకపోతే..

నేషనల్ కన్య్జూమర్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి. 1915 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు నమోదు చేయవచ్చు. లేక consumerhelpline.gov.in ద్వారా కంప్లెయింట్ చేయొచ్చు.

కన్జ్యూమర్ కోర్టుల్లో చట్టబద్ధ చర్యలు ఇలా..

పెద్ద సమస్యలు ఉంటే కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రీడ్రెస్సల్ ఫోరమ్స్‌లో ఫిర్యాదు చేయాలి. 

జిల్లా కోర్టుల్లో: రూ.50 లక్షల వరకు క్లెయిమ్ 

రాష్ట్ర కోర్టుల్లో: రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు క్లెయిమ్

జాతీయ కోర్టుల్లో: రూ.2 కోట్లకు పైబడి క్లెయిమ్

రీఫండ్ సమస్యలు రాకుండా ఉండాలంటే..

- కచ్చితంగా వస్తువు కొనేముందే రిటర్న్ పాలసీ చదవాలి.

- బిల్లులు, ఇతర రసీదులు ప్రూఫ్‌లా ఉంచుకోవాలి.

- డిస్ప్యూట్ కేసుల్లో కాల్స్‌ను రికార్డు చేయాలి. ఈమెయిల్స్‌ను భద్రపరచాలి.

- ఫ్రాడ్ ఉండకుండా నమ్మదగిన అమ్మకందారుల వద్దే వస్తువులు కొనాలి.


2026లో 27 సాధారణ సెలవులు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్