RPF Constable Answer Key 2025 ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆన్సర్ కీని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. ప్రశ్నపత్రాలు, రికార్డెడ్ రెస్పాన్సెస్ కూడా తన వెబ్‌సైట్‌లో పొందుపర్చింది.
ప్రతీకాత్మక చిత్రం
ఈవార్తలు, న్యూఢిల్లీ: RPF Constable Answer Key 2025 ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆన్సర్ కీని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. ప్రశ్నపత్రాలు, రికార్డెడ్ రెస్పాన్సెస్ కూడా తన వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. మార్చి 2 నుంచి మార్చి 18 వరకు జరిగిన కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఆన్సర్ కీని చాలెంజ్ చేయాలనుకునేవారు ఈ నెల 29 లోగా చాలెంజ్ చేయవచ్చని వెల్లడించింది. దానికోసం ఒక్కో అబ్జెక్షన్‌కు రూ.50తోపాటు బ్యాంకు చార్జీలు కట్టాల్సి ఉంటుందని వివరించింది. ఆ అబ్జెక్షన్ వ్యాలిడ్ అయితే బ్యాంకు చార్జీలు మినహా మిగతా మొత్తాన్ని రీఫండ్ చేస్తామని స్పష్టం చేసింది.
ఆన్సర్ కీ ని చెక్ చేసుకోవాలంటే..
- ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆన్సర్ కీ లింక్‌పై క్లిక్ చేయాలి.
- లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి.
- సబ్మిట్ నొక్కి, ఆన్సర్ కీ ని చూడవచ్చు.