పావ్ బాజీ pav bhaji ఎంత ఫేమస్సో దాని వెనుక చరిత్ర కూడా అంతే గొప్పది. ముంబై వీధుల్లో పుట్టిన పావ్ బాజీ.. ప్రపంచంలోని బెస్ట్ ఫుడ్స్‌లో ఒకటిగా నిలిచింది.
ప్రతీకాత్మక చిత్రం
పావ్ బాజీ pav bhaji ఎంత ఫేమస్సో దాని వెనుక చరిత్ర కూడా అంతే గొప్పది. ముంబై వీధుల్లో పుట్టిన పావ్ బాజీ.. ప్రపంచంలోని బెస్ట్ ఫుడ్స్‌లో ఒకటిగా నిలిచింది. అయితే, పావ్ బాజీ పుట్టుక వెనుక పెద్ద కథే ఉంది. అమెరికాలో వచ్చిన ఓ యుద్ధం.. ముంబైలో పావ్ బాజీ పుట్టుకకు కారణమైందంటే ఆశ్చర్యపోక మానరు. అసలేం జరిగిందంటే.. 1860ల్లో అమెరికన్ సివిల్ వార్ వల్ల పత్తి ఉత్పత్తి తగ్గిపోవడంతో బ్రిటిష్ మిల్స్ సంక్షోభంలో కూరుకుపోయాయి. దీంతో ఆ మిల్స్ అన్నీ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాయి. దీంతో ముంబై.. బ్రిటిష్ టెక్స్‌టైల్స్ మిల్స్‌కు కాటన్ కీ సప్లయర్‌గా మారింది. దాంతో ముంబైలో టెక్స్‌టైల్ కంపెనీలకు కార్మికులు పెద్దమొత్తంలో అవసరం అయ్యారు. ఆ కార్మికులను దేశంలోని పలు ప్రాంతాల నుంచి రప్పించుకున్నారు.
అయితే, ఆ కార్మికులకు ఆకలి తీర్చేందుకు చిరు వ్యాపారులు తక్కువ సమయంలో ఆహారం తయారయ్యే పద్ధతులను మొదలుపెట్టారు. అందులోభాగంగానే మిగిలిపోయిన కూరగాయలను తురిమి, మసాలాలు వేసి, వెన్నతో కలిపి నోరూరించే బాజీ తయారు చేశారు. ఆ బాజీని బ్రెడ్ ముక్కల మధ్య పెట్టి సరఫరా చేయటం మొదలుపెట్టారు. తక్కువ సమయంలో తయారవ్వటమే కాకుండా, రుచిగా ఉండటంతో కార్మికులంతా ఆ డిష్ తినడం మొదలుపెట్టారు. కార్మికుల్లో పావ్ బాజీకి ఆదరణ పెరిగింది. అలా.. స్ట్రీట్ ఫుడ్‌లో పావ్ బాజీ అంటే ఫేవరెట్ ఫుడ్ అయ్యింది. అలా ముంబైలో పుట్టిన పావ్ బాజీ.. భారతదేశమంతా.. ప్రపంచమంతా పాకింది.